- Advertisement -
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చారాణా కూడా రైతు రుణమాఫీ కాలేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండి పడ్డారు. రేవంత్ నిజాయితీ గల మోసగాడని కెటిఆర్ అన్నారు. ఆమనగల్ లో బిఆర్ఎస్ రైతు దీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కెటిఆర్ మాట్లాడారు. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ ఎవరికైనా అయిందా?నని ప్రశ్నించారు. 35 సార్లు ఢిల్లీ పోయినా 35 పైసలు కూడా తేలేదని విమర్శలు గుప్పించారు. ఫోర్త్ సిటీ, ఎఐ సిటి, ఫ్యూచర్ సిటి పేరుతో డ్రామాలు చేస్తున్నారని కెటిఆర్ పేర్కొన్నారు.
- Advertisement -