- Advertisement -
హైదరాబాద్: కాంగ్రెస్ అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. బిఆర్ఎస్ నేతలపై చేసిన దాడి అత్యంత హేయమైన చర్యని ఆరోపించారు. కొల్లాపూర్ నియోజక వర్గంలో బిఆర్ఎస్ నేతలపై చేసిన దాడిని ఖండించారు. దాడులు చేస్తున్ననేతలకే పోలీసులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ప్రజాపాలన అంటే ప్రజల గొంతుకు వినిపించిన వారిపై దాడి చేయడమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ఫ్యాక్షన్ తరహాలో దాడులు పెరిగాయని ధ్వజమెత్తారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అండదండలతోనే ఈ విష సంస్కృతి పెరిగిందన్నారు. కాంగ్రెస్ దాడులకు బిఆర్ఎస్ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని కెటిఆర్ హెచ్చరించారు.
- Advertisement -