Monday, December 23, 2024

కేంద్రం అడ్డుపడ్డా ప్రగతి ఆగదు….

- Advertisement -
- Advertisement -

తెలంగాణపై కావాలనే కేంద్రం దుర్బుద్ధి

ప్రగతిశీల రాష్ట్రానికి బడ్జెట్‌లో మరోసారి మొండిచెయ్యి
ఎన్ని లేఖలు రాసినా కేంద్రం బుట్టదాఖలు చేసింది
మోడీ ప్రభుత్వం నిధులిచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తాం
ప్రభుత్వ భూమిలో ఇళ్లు కట్టుకున్నవారికి న్యాయం చేస్తాం
దేశాన్ని పురోగమనం దిశగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే రాజ్యాంగంపై సిఎం కెసిఆర్ వ్యాఖ్యలు చేశారు : మంత్రి కెటిఆర్
మేడ్చల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు

KTR comments Modi government

మన తెలంగాణ/హైదరాబాద్:  కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేదలకు ఉపయోగ పడే ఒక్క అంశం కూడా లేదని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో లేదన్నట్లుగా వ్యవహరించిందని మండిపడ్డారు.తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రానికి మరోసారి మొండిచేయి చూపెట్టారని ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. పురోగతిలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న రాష్ట్రానికి మరింత చేయూతనందించాలని కేంద్రానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా…. అన్నింటిని బుట్ట దాఖలు చేశారన్నారు.

కేంద్రం నిధులు ఇచ్చినా….ఇవ్వక పోయినా ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఇదే రీతిలో అభివృద్ధిలో ముందుకు సాగుతుందని అన్నారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం చేసి కేంద్రం మరోసారి వివక్ష చూపిందని ఆరోపించారు. కేంద్రం నిధులన్నీ బిజెపి పాలిత రాష్ట్రాలకే మళ్లీస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే ఒక్క రూపాయి ఇవ్వలేదు… కానీ గుజరాత్‌లో వరదలకు మాత్రం రూ.వెయ్యి కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. ఆ రాష్ట్రానికి నిధులు ఇవ్వడాన్ని తాము తప్పుపట్టడం లేదని…అదే సమయంలో తెలంగాణకు కూడా నిధులు ఇవ్వాలనే కోరుతున్నామన్నారు. కానీ నరేంద్రమోడీ సర్కార్ మాత్రం బిజెపియేతర ప్రభుత్వాలు ఇచ్చే విజ్ఞప్తులు…అభ్యర్ధనలు అన్నీ చిత్తుకాగితాలతో సమానంగా చూస్తోందన్నారు. ఇదేనా కేంద్రం సబ్‌కా సాత్….సబ్‌కా వికాస్ అని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. మేడ్చల్ జిల్లాలోని జవహార్‌నగర్, ఫిర్జాదీగూడ, బోడుప్పల్ మున్సిపాలిటీల పరిధిలో బుధవారం జిల్లా మంత్రి మల్లారెడ్డితో కలిసి కోట్లాది రూపాయలతో తలపెట్టిన పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలల్లో కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ, పన్నుల రూపంలో పెద్దమొత్తంలో ఆదాయాన్ని గుంజుకుంటున్న కేంద్రం, రాష్ట్రానికి తిరిగి చెల్లించడానికి ఎందుకు మనసు రావడం లేదన్నారు. మా రాష్ట్రం నుంచి తీసుకున్న పన్నులను కూడా తెలంగాణ ప్రజలు అడుక్కోవాలా? అని  నిలదీశారు.

రాష్ట్ర విభజన హామీలను పట్టించుకోదు, ఇస్తామన్న ప్రాజెక్టులను ఇవ్వదు… ఒక్క నీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించదు, పైగా రాష్ట్రంపై కేంద్రం రుబాబు చేస్తోందని ఆయన తీవ్ర అసహనాన్ని వెళ్ళగక్కారు. గతంలో ఏ కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలపై ఇంత వివక్ష చూపిన దాఖలాలు లేవన్నారు. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వ పాలన అంటే….రాష్ట్రాలపై పెత్తనం సాగించడమే అన్న చందంగా మారిందని దుయ్యబట్టారు. అసలు కేంద్రం దృష్టిలో తెలంగాణ ఏదో పాకిస్తాన్‌లో ఉందన్న భావనతో ఉన్నట్లు కనిపిస్తోందని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఇది ప్రధాన మంత్రి పదవిలో కొనసాగుతున్న వ్యక్తికి ఉండాల్సిన లక్షణం కాదన్నారు. అందుకే కేంద్ర బడ్జెట్‌పై సిఎం కెసిఆర్ తీవ్ర స్థాయిలో ఆక్షేపించారన్నారు. దేశాన్ని తిరిగి పురోగతి దిశగా తీసుకెళ్లాలంటే రాజ్యాంగంలో మార్పులు అవసరమని వ్యాఖ్యానించారన్నారు. దేశంలో భౌగోళికంగా 11వ పెద్ద రాష్ట్రంగా, జనాభాపరంగా12వ పెద్ద రాష్ట్రమైన తెలంగాణ దేశానికి తిండి పెట్టే రాష్ట్రాల్లో 4వ స్థానంలో ఉందన్నారు. ఈ మాట తాము చెబుతున్నది కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతోందని ఆయన పేర్కొన్నారు. అలాంటి తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా మరోసారి మొండి చెయ్యి చూపించి తన ఈర్శ బుద్దిని చూటుసిఎం కెసిఆర్ నేతృత్వంలో మరింత వేగంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతాయన్నారు. ఇప్పటికే పలు రంగాల్లో దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిన తెలంగాణ రాష్ట్రం….భవిష్యత్తుల్లో ప్రతి కార్యక్రమానికి మార్గదర్శకంగా నిలువనుందన్నారు. సిఎం కెసిఆర్ తన రాజకీయ అనుభవనాన్ని అంతా రంగరించి, పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారన్నారు. ఈ పథకాలకు నిధుల కటకట ఏర్పడాలన్న దుర్భుద్ధితోనే కేంద్రం రాష్ట్రానికి ఎటువంటి సాయం అందించడం లేదని మండిపడ్డారు.

అయినా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగవని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకున్నవారికి న్యాయం చేస్తామని హామీనిచ్చారు. జీవో 58,59 ద్వారా ప్రజలకు ఇళ్ల పట్టాలు అందజేస్తామని వెల్లడించారు. డంపింగ్ యార్డుల్లో రూ.147 కోట్లతో గ్రీన్ క్యాపింగ్ చేశామని పేర్కొన్నారు. చెరువులు కలుషితం కాకుండా రూ.250 కోట్లతో లిచింగ్ చేశామన్నారు. సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచామని స్పష్టం చేశారు. మనఊరు…-మనబడి కింద రూ.7289 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. అలాగే శివారు మున్సిపాలిటీల్లో మంచినీటి పథకాలకు వందల కోట్లు కేటాయిస్తున్నామన్నారు. చన్నీళ్లకు వేడినీళ్లు తోడు అన్నట్లుగా కేంద్రం నుంచి సహకారం ఆశించామన్నారు. కాని కేంద్ర బడ్జెట్‌లో ఏ వర్గానికి ప్రయోజనం కలిగలేదని విమర్శించారు. బడ్జెట్‌లో రాష్ట్రప్రాజెక్టులకు జాతీయ హోదా కోరామన్నారు. మెట్రో రైలుకు కూడా నిధులు అడిగామన్నారు. అలాగే మిషన్ భగీరథకు నిధులు అడిగితే….వాటికి కేంద్ర బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా రాలేదని మండిప

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News