Friday, November 22, 2024

ఆ పథకంలో స్కామ్ జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తోంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అమృత్ పథకంలో స్కామ్ జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడంలేని ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. అమృత్ పథకం కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  రాష్ట్రానికి కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలన్నారు. రేవంత్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరామన్నారు. ఢిల్లీలో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.  తెలంగాణను కాంగ్రెస్ ఎటిఎంలా మార్చిందనేది నిజమైతే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సొంత వర్గానికి పనులు అప్పగించడం ఎంత వరకు సమంజసం అని నిలదీశారు. ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు వెళ్లి వస్తున్నారని, ఢిల్లీ నుంచి 26 పైసలు కూడా తెలంగాణకు రావడం లేదని ఎద్దేవా చేశారు. అల్లుడి కోసం కొడంగల్‌ను బలిపెట్టే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. అమృత్ పథకం పనులు మంత్రి శ్రీనివాస్ రెడ్డి సంస్థలకు కూడా కట్టపెట్టారన్నారు. బిఆర్‌ఎస్ నేతలు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నిస్తున్నారని, ప్రధాన ప్రతిపక్షంగా తాము ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్తామని, దేశ ప్రజల దృష్టికి కాంగ్రెస్ మోసాలను తీసుకెళ్తామని కెటిఆర్ తెలియజేశారు. బిఆర్‌ఎస్ నేతలు ఢిల్లీకి వస్తే కాంగ్రెస్ నేతలకు భయం ఎందుకు అని ఎదరు ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News