Sunday, January 19, 2025

బిజెపి ఎంపిలు నియోజకవర్గానికి ఒక్క రూపాయి అయినా తీసుకొచ్చారా?: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రాజన్న సిరిసిల్ల: విద్యతోనే వికాసం… విద్యతోనే ఆత్మవిశ్వాసం ఉంటుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో మంత్రి కెటిఆర్ పర్యటిస్తున్నారు. ఎల్లారెడ్డి పేట పాఠశాల భవన సముదాయాన్ని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ నాలుగు గోడలే దేశ భవిష్యత్‌కు మూలస్తంభాలు అని తెలిపారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారని ప్రశంసించారు. తొమ్మిదేళ్ల క్రితం పరిస్థితులు.. ప్రస్తుత పరిస్థితులపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు. తొమ్మిదేళ్ల క్రితం రైతుబంధు, దళిత బంధు ఉందా? అని ప్రశ్నించారు.

Also Read: పవన్‌కు మానసిక వైద్యుడు అవసరం: అంబటి రాంబాబు

ఆనాడు కరెంటు ఎలా ఉండేదని… ఇప్పుడు కరెంట్ ఎలా? ఉందని ప్రశ్నించారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. 50 ఏళ్లు పాలించిన వాళ్లు ఏం చేశారని కెటిఆర్ నిలదీశారు. బిజెపి ఎంపిలు నియోజకవర్గానికి ఒక్క రూపాయి అయినా తీసుకొచ్చారా? అని చురకలంటించారు. కస్తుర్బా స్కూల్ వచ్చిందా?… నవోదయ విద్యాలయం వచ్చిందా? అని అడిగారు. బిజెపి నేతలకు దమ్ముంటే ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పి నిధులు తీసుకరావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News