Friday, December 20, 2024

బిజెపికి ఓటేస్తే సిలిండర్ ధర రూ.4 వేలు అవుతుంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR comments on Modi

మునుగోడు: బిజెపి అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోతేనే మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలో చివరి రోజు ప్రచారం సందర్భంగా నారాయణ్‌పూర్ మండల కేంద్రంలో మంత్రి కెటిఆర్ రోడ్‌షో చేపట్టారు. మంత్రి కెటిఆర్ మాట్లాడారు. ఇది ప్రజల మీద బలవంతంగా రుద్దబడిన ఎన్నిక అని మండిపడ్డారు. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు లీటర్ పెట్రోల్ రూ.70 కే ఉండేదని, ఇప్పుడు 110 రూపాయలు అయ్యిందని మండిపడ్డారు. బిజెపి మాయమాటలు నమ్మి ఓటేస్తే సిలిండర్ ధర 4 వేల రూపాయలు అవుతుందన్నారు. నిత్యావసరాల ధరలు పెంచిన బిజెపి వైపు ఉంటారా?.. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న టిఆర్‌ఎస్ వైపు ఉంటరా? తెల్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆ గట్టున ఉంటారా… ఈ గట్టున ఉంటారా తేల్చుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News