బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో తాజా పరిణామాలపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. “నా మాటలు రాసిపెట్టుకోండి. నా పునరాగమనం ఎదురుదెబ్బ కంటే బలంగా ఉంటోందని పేర్కొన్నారు. మీ అబద్ధాలు నన్ను విచ్ఛిన్నం చేయవు…మీ ఆరోపణలు నన్ను తగ్గించలేవు అని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. మీ మాటలు నన్ను తగ్గించవు… మీ చర్యలు నా దృష్టిని మరుగుపరచవు..
కోపోద్రిక్తత తనను నిశ్శబ్దం చేయదు అని పేర్కొన్నారు. నేటి అడ్డంకులు రేపటి విజయానికి దారి తీస్తాయి.. సత్యం కాలంతో పాటు ప్రకాశిస్తుంది అని వ్యాఖ్యానించారు. తనకు మన న్యాయవ్యవస్థపై గౌరవం ఉంది అని, న్యాయం గెలుస్తుందని తనకు అచంచలమైన నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. సత్యం కోసం తన పోరాటం కొనసాగుతుందని, త్వరలో ప్రపంచం కూడా దానికి సాక్ష్యమివ్వనుందంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.