Thursday, February 13, 2025

బిసిలకు సిఎం క్షమాపణ చెప్పాలి

- Advertisement -
- Advertisement -

కులగణన తప్పని
రాష్ట్ర ప్రభుత్వం
అంగీకరించడం
హర్షణీయం :బిఆర్‌ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్
కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కారు చేసిన కులగణన సర్వే తప్పుల తడక అని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా స్వాగతించారు. అయితే బిసిల జనాభాను తగ్గించి వెనకబడిన వర్గాల ప్రజలను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినందుకు సిఎం రాష్ట్రంలోని బిసిలందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసమగ్రంగా చేసిన సర్వేపై బిఆర్‌ఎస్‌తోపాటు..బిసి సంఘాలు ముక్తకంఠంతో అభ్యంతరం వ్యక్తం చేసినా వినకుండా.. కాంగ్రెస్ అసంపూర్తి లెక్కల ఆధారంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం ముమ్మాటికీ తప్పేనని అంగీకరించాలన్నారు.

రెండోసారి సర్వేనైనా సమగ్రంగా చేయడంతోపా టు.. బిసిలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన త రువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశా రు. కేవలం తూతూమంత్రంగా తీర్మానం చేసి.. బిసి రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకుందామంటే మాత్రం బిఆర్‌ఎస్ తోపాటు..బిసి సంఘాలు ఎట్టిపరిస్థితుల్లో అం గీకరించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కామారెడ్డి బిసి డిక్లరేషన్‌లో ఇచ్చిన మాటను సంపూర్ణంగా నిలబెట్టుకునే వరకూ కాంగ్రె స్‌ని రాష్ట్రంలోని బిసిలెవరూ నమ్మే పరిస్థితిలో లేరనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకుంటే మంచిదని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News