Thursday, November 21, 2024

బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పంటల దిగుబడిలోనే కాదు, పశు సంపదలోనూ గత పదేళ్లు పండుగ వాతావరణం ఉందని అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కులవృత్తులకూ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కొండంత అండగా ఉండడంతోనే పశుసంపదలో గణనీయ వృద్ధి కనిపించిందన్నారు. శనివారం కెటిఆర్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. గ్రామీణ తెలంగాణలో ఉపాధి పెంచాలనే తపన ఉండేదని, సంపద సృష్టిలో అందరినీ భాగస్వామ్యం చేయాలనే తాపత్రయం ఉండేదన్నారు. తెలంగాణలో డిమాండ్ తగ్గట్టుగా మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు పెంచే ప్రయత్నం చేశామని, ఇతర రాష్ట్రాలనుంచి ప్రతి రోజు వచ్చే వందలాది లారీల దిగుబడికి పదేళ్లలో కళ్లెం పడిందని కెటిఆర్ ప్రశంసించారు.

ప్రతి ఆలోచన వెనక ఒక సుదీర్ఘ అధ్యయనం ఉందని, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ లక్ష్యం ఆరోగ్య తెలంగాణ నిర్మాణం అని తెలియజేశారు. పదేళ్లలో వేల కోట్ల వృద్ధి జరిగిందని కేంద్రం ప్రకటించడం సంతోషంగా ఉందని, ఈ అద్భుత స్కీములను స్కాములు అని దుష్ప్రచారం చేసిన దుర్మార్గులు ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచించారు. కళ్లముందు ఆవిష్కృతమైన ఈ అద్భుతాలను చూసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు. కానీ నేడు గొర్ల పంపిణీ లేక, చేప పిల్లల పంపిణి నిలిపేసి కుల వృత్తులను రూపుమాపే కుట్రలు చేస్తున్న పాలకులారా కేంద్ర లెక్కలు చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని కెటిఆర్ తెలిపారు.

పోరాడి సాధించుకున్న పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని కెటిఆర్ విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామిక తెలంగాణలో.. మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, హక్కులను అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. పోరాడితే సస్పెన్షన్లు, ఇది నియంతృత్వ రాజ్యమా?, నిర్బంధాన్ని నిర్మిస్తున్న ప్రభుత్వమా? అని అడిగారు. పోరాటం తెలంగాణకు కొత్తకాదు అని, ఈ మట్టి పొత్తిళ్ళలో పోరాటం ఉందని, ఆ సహజత్వాన్ని ఎత్తిపడుతూ నిర్బంధాన్ని ఎదురిస్తామని, ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్దరణకై పోరాడుతామని కెటిఆర్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News