Wednesday, March 26, 2025

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు అడుగడుగునా
అన్యాయం చేస్తున్న కాంగ్రెస్,
బిజెపిలు ఏం తెలవనోడు కూడా
కెసిఆర్ గురించి పేలుతుండు
జానెడున్నోడు.. మూడు
ఫీట్లున్నోడు ఎగిరెగిరి పడుతుండు
కరీంనగర్ కార్యకర్తల
సమావేశంలో బిఆర్‌ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్ కెటిఆర్

మన తెలంగాణ/ఉమ్మడి కరీంనగర్ బ్యూరో: ఇయ్యాల భూ మికి జానెడున్నోడు, మూడు ఫీట్లున్నోడు ఎగిరెగిరి పడుతున్నడని కాంగ్రెస్, బిజెపిలపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జి ల్లా పార్టీ కార్యకర్తల సమావేశం కరీంనగర్ ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. తెలంగాణ గురించి ఏం తెల్వనోడు కూడా కేసీఆర్ ఏంజేసిండని మాట్లాడుతున్నరని ఎద్దేవా చేశారు. కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడుతుంటే చూడాలని, గ్రామ సింహాలు కూడా సిం హాల లెక్క గర్జిస్తుంటే చూడాలని వ్యాఖ్యానించారు. ఆ రెండూ పార్టీలు తెలంగాణ ప్రజలను ఏళ్లుగా మోసం చేస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, ఏండ్లకేండ్లు ఈ ప్రాంతాన్ని పాలించిన కాంగ్రెస్ తెలంగాణకు అడుగడుగునా అన్యాయమే చేశాయని, ఈ రెండూ దొందూదొందేనని మర్శించారు. తెలంగాణ ప్రజల కోసం మళ్ళీ గులాబీ జెం డా ఎగరాలని

పిలుపునిచ్చారు. ఏప్రిల్ 27 తరువాత కొత్త సభ్యులను చేర్చుకుందామని అన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా మోదీ ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షల చొప్పున వేస్తానని అ న్నారని, మరి మీ ఖాతాల్లోకి రూ.15లక్షలు వచ్చినయా? అని కెటిఆర్ ప్రశ్నించారు. 1998లో ఒక ఓటు వేయండి.. రెండు రాష్ట్రాలు ఇస్తమని బిజెపి కాకినాడలో ఒక తీ ర్మానం చేసిందని, మరి బిజెపి రాష్ట్రం ఇచ్చిందా..? ఇయ్యలే. కాకినాడ తీర్మానాన్ని కాకి ఎత్తుకుపోయింది. బిజెపి అయ్యాల్నే అట్ల మోసం చేసిందని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ మోసం గురించి చెప్పనక్కరలేదని, ఆ పార్టీ మొదటి నుంచి తెలంగాణను మోసం చేస్తూనే వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తమని చెప్పిన ఓట్లేసిండ్రు. ఇందిరమ్మ రాజ్యంల ఎంత అరాచకం జరిగిందో కొందరు మర్చిపోయినట్లున్నారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా..అని మండిపడ్డారు.
పోరాటాల పురిటిగడ్డ ఈ కరీంనగర్
కెసిఆర్‌కు కరీంనగర్ జిల్లా అంటే సెంటిమెంటని, ఇక్కడి నుంచి ఏ పని మొదలుపెట్టినా విజయవంతం అయితదినే విశ్వాసం ఉన్నదని, కాబట్టే పార్టీ పెట్టిన తర్వాత మొదటి బహిరంగ సభ సింహగర్జన 2001 మే 17న ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో పెట్టారని చెప్పారు. నాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గడ్డ కరీంనగర్ గడ్డ అని గుర్తు చే శారు. కరీంనగర్ నుంచి ఏ పని మొదలుపెట్టినా విజయవంతం అయితదని, అందుకే పార్టీ కార్యకర్తల తొలి సమావేశాన్ని కూడా కరీంనగర్లోనే పెట్టామని చెప్పారు. బిఆర్‌ఎస్ ఒక ప్రత్యేకమైన పార్టీ అని, ఈ దేశంలో ఎన్నో పార్టీలు పుట్టినయ్..మాయమైపోయినయ్ అని, ఉద్యమ పార్టీగా పుట్టి పదేళ్లు అధికార పార్టీగా వెలుగొందిన పార్టీ బిఆర్‌ఎస్ అన్నారు.
మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించాలి
విగ్రహాల ఆవిష్కరణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని మహనీయుల విగ్రహాలను సైతం రాజకీయం చేయడం కాంగ్రెస్‌కే చెల్లిందని కెటిఆర్ అన్నారు. కరీంనగర్ పర్యటనకు వెళ్తున్న మార్గమధ్యంలో తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఆర్‌టిసి బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ చేయాలని జెఎసి ఆధ్వర్యంలో చేపటి ్టన నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కరీంనగర్ చేరుకోగా గులాబీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. సేవ్ తెలంగాణ రామన్నా..
సిఎం.. సిఎం..కెటిఆర్ అంటూ కార్యకర్తలు నినదించారు. తెలంగాణకు రేపటి సూరీడు కెటిఆర్ అంటూ నినదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News