Sunday, December 22, 2024

నేతన్నలపై కాంగ్రెస్ కక్ష: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పాలనలో పదేళ్లు చేనేత రంగం కళకళలాడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్‌ఎ కెటిఆర్ విమర్శించారు.  చేనేత కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లేఖ రాశారు. 2004 నుంచి 2014 వరకు వస్త్ర పరిశ్రమ ఎలాంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసునని, ఇప్పుడు అదే పరిస్థితి నెలకొందని, కాంగ్రెస్ ప్రభుత్వ అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరితో గత నాలుగు నెలలుగా నేతన్నలు చేనేత పనులకు దూరమవ్వడంతో పాటు పవర్ లూమ్స్ పూర్తిగా బంద్ అయ్యాయని అన్నారు. నేతన్నలపై కాంగ్రెస్ ఎందుకింత కక్ష కట్టిందని  ప్రశ్నించారు. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా?, నేతన్నలకు అర్డర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆపేసిందని అడిగారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మాదిరిగా నేతన్నలకు చేతినిండా అర్డర్లు వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చేనేత మిత్ర వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టిందని, ప్రస్తుతం అందుతున్న అన్నీ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయడంతో పాటు అవసరం అయితే మరింత సాయం చేయాలని కోరారు. కేవలం గత ప్రభుత్వంపై దుగ్దతో నేతన్నల పొట్ట కొట్టడం సరికాదని హితువు పలికారు.

వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుచూపు, చిత్తశుద్ధి లేకపోవడంతో వేలాది మంది రైతన్నలు, పవర్ లూమ్ కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో వారి జీవితాలు దుర్భరంగా మారాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News