Friday, December 20, 2024

మేము ఆ విషయంలో ప్రచారం చేసుకోలేకపోయాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి: కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ అందరినీ మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి ఆరు నెలల్లోనే ప్రజలకు అర్థమైందని ఎద్దేవా చేశారు. ఇల్లందులో ఎంఎల్‌సి ఎన్నికల ప్రచారం సభలో కెటిఆర్ మాట్లాడారు. బిఆర్‌ఎస్ పాలనలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, ప్రైవేటు రంగంలో 24 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేశామని గుర్తు చేశారు. గత పదేళ్లలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని, సామాజిక మాద్యమాల్లో తమపై బాగా దుష్ప్రచారం చేశారని, ఉద్యోగాల కల్పనపై తాము సరిగా ప్రచారం చేసుకోలేదని, గత 65 ఏళ్లలో తెలంగాణకు వచ్చిన వైద్య కళాశాలలు మూడు మాత్రమే ఉన్నాయని, కెసిఆర్ పాలనలో 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని కెటిఆర్ తెలియజేశారు. వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేశామని, వ్యవసాయ ఉత్పత్తుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News