Sunday, September 8, 2024

జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించలేదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులు కాంగ్రెస్ ప్రారంభించిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. ఆయారాం, గయారం సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. మంగళవారం బిఆర్ఎస్ భవన్ నుంచి ఆయన మాట్లాడారు.  కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు మర్చిపోయి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకుందని విమర్శించారు. గోవా, కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ విమర్శలు చేశారని,  ఇప్పుడు తెలంగాణాలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలోకి ఎలా చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు.   ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ఎక్కువగా ప్రోత్సహించిందని, 2023 ఎన్నికల్లో కేవలం నాలుగు లక్షల ఓట్లతోనే అధికారం కోల్పోయామని కెటిఆర్ గుర్తు చేశారు. సిఎం, డిప్యూటీ సిఎం సంతకాలతో ఆరు గ్యారంటీల పత్రాన్ని తయారు చేశారని, ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదని కెటిఆర్ అడిగారు. ప్రజలతో మాకు గ్యాప్ వచ్చిందని, మా వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బిఆర్‌ఎస్ ఓడిపోవడం ప్రజల తప్పు అనడం మా తప్పే అవుతుందన్నారు. టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చడంతోనే ఓడిపోయామనడానికి కారణాలు కనిపించడంలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News