Wednesday, September 18, 2024

కెసిఆర్ రైతును రాజు చేస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణాలు తీస్తోంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శలు గుప్పించారు. బిఆర్ఎస్ ఎంఎల్ఎ, మాజీ మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్ లో ట్విట్ చేశారు. రుణమాఫీ కాలేదని కొందరు రైతులు ప్రాణాలు వదులుకోవడం ఆందోళనకరంగా మారిందని, పెట్టుబడి సాయం లేకపోవడంతో మరికొంత మంది ప్రాణాలు వదులుతున్నారని దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రైతును రాజు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణాలు తీస్తోందని ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా అనేవి రెండు కూడా బోగస్ అని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తీరని ద్రోహానికి ఇంకా ఎంతమంది రైతులు ప్రాణాలను బలిపెట్టాలని ప్రశ్నించారు. ఏకకాలంలో అందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇచ్చిన మాటను తప్పిన ముఖ్యమంత్రిని ఏం చేయాలని కెటిఆర్ అడిగారు. డిసెంబర్ లో పెట్టిన డెడ్ లైన్ సెప్టెంబర్ దాటినా అమలుకాకపోతే దగాపడ్డ అన్నదాతలు ఇంకా ఎవరికి చెప్పుకోవాలన్నారు. 49,500 వేల కోట్ల రుణమాఫీలో పావుశాతం కూడా చేయకుండా చేతులెత్తేసినందుకు రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ కళ్ళు చల్లారుతాయని కెటిఆర్ విమర్శలు గుప్పించారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీ యాత్రలు చేయటం కాదు అని, తెలంగాణలో ఏం జరుగుతుందో చూడాలన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, దైర్యంగా ఉండాలని కోరుతున్నామని కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News