Wednesday, December 25, 2024

మన బాస్‌లు ఢిల్లీలో లేరు తెలంగాణ గల్లీలో ఉన్నారు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రాజన్నసిరిసిల్ల: గులాబీ జెండా అంటేనే పేదల జెండా అని మంత్రి కెటిఆర్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా మంత్రి కెటిఆర్ పర్యటిస్తున్నారు. బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించుకున్నామని, మన బాస్‌లు తెలంగాణ గల్లీలో ఉన్నారని, కాంగ్రెస్, బిజెపి బాస్‌లు ఢిల్లీలో ఉన్నారని కెటిఆర్ చురకలంటించారు. బిఆర్‌ఎస్ మేనిఫెస్టో చూసి కాంగ్రెస్, బిజెపిలకు వణుకు పుడుతుందని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పథకాలను కాపీ కొట్టారని, సిఎం కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని కెటిఆర్ ప్రశంసించారు. సిఎం కెసిఆర్‌ను తిడితే ఓట్లు రావని, తనకు నచ్చిన పథకం కెసిఆర్ భీమా- ప్రతి ఇంటికి ధీమా అని ప్రశంసించారు. 93 లక్షల కుటుంబాలకు కెసిఆర్ బీమాతో ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కె కేశవరావు, మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News