Thursday, January 23, 2025

ఈనగాసి నక్కలపాలు చేయొద్దు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం లేకుంటే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డికి ఆ పదవులుండేనా? అని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. జిట్టా బాలకృష్ణా రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిచేది పైళ్ల శేఖర్ రెడ్డి అని ప్రశంసించారు. సొంత గూటికి తిరిగొచ్చిన బాలకృష్ణారెడ్డికి శుభాకాంక్షలు అని, దారితప్పిన కుమారుడు ఇంటికి తిరిగొచ్చినట్టుగా ఉందని కెటిఆర్ చెప్పారు. ఈనగాసి నక్కలపాలు చేయొద్దని బిజెపి, కాంగ్రెస్ కలిసి వస్తున్నారని విమర్శలు గుప్పించారు.

రూ.50 లక్షలతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని చురకలంటించారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని బలిదేవత అన్నది రేవంత్ రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. ఉద్యమంలో బిడ్డలు అమరులు కావడానికి కాంగ్రెస్ కారణం కాదా? అని కెటిఆర్ అడిగారు. తెలంగాణ ప్రజల్ని గుజరాతీ విముక్తి చేస్తాడని మోడీ అన్నారని గుర్తు చేశారు. సోనియమ్మ దయతలిచి తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, అప్పట్లో టిఆర్‌ఎస్ లేకుంటే టిపిసిసి, టిబిజెపి ఉండేవా? అని నిలదీశారు. కాంగ్రెస్, బిజెపి జాతీయ నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని కెటిఆర్ దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News