హైదరాబాద్: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో భారీ భూకుంభకోణాన్ని బయటపెడతానని హెచ్చరించారు. 400 ఎకరాలు కాదు అని దాని వెనుక వేల ఎకరాల భూకుంభ కోణం ఉందని ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణంలో బిజెపి ఎంపి కూడా ఉన్నారని, రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు.
ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే, మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నారని కెటిఆర్ చురకలంటించారు. కాంగ్రెస్, బిజెపిలకు ఉమ్మడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. రేవంత్‌ని కాపాడుతోంది కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అని విమర్శలు గుప్పించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాంబులు తుస్సుమన్నాయని కెటిఆర్ వ్యంగ్యస్త్రాలు సంధించారు. బిజెపి ఇచ్చిన అచ్ఛే దిన్ వచ్చిందని, ఎన్ డిఎ ప్రభుత్వం ఒకే రోజు హ్యాట్రిక్ సాధించిందని దుయ్యబట్టారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే మోడీ ప్రభుత్వం మాత్రం ఎల్‌పిజి సిలిండర్ల ధరను రూ.50 పెంచడంతో పాటు పెట్రోల్, డీజిల్ కు అదనంగా రెండు రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని విధించిందని కెటిఆర్ ధ్వజమెత్తారు. స్టాక్ మార్కెట్ లో ఒక్క రోజులోనే 19 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందని మండిపడ్డారు. ఇది అచ్ఛే దిన్ నుంచి హామీనా?, మేక్ ఇన్ ఇండియా నినాదామా ? అని మోడీ ప్రభుత్వంపై కెటిఆర్ విరుచుకపడ్డాడు.
400 ఎకరాలు కాదు… వేల ఎకరాల భూకంభకోణం బయటపెడుతా: కెటిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -