Saturday, November 23, 2024

నిత్యం అరెస్టుల పర్వమే కొనసాగుతోంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మాజీ సర్పంచులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సోమవారం కెటిఆర్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడిగినా ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నిత్యం అరెస్టుల పర్వమే కొనసాగుతోందని, పోలీసులతో సమస్యలను అణగదొక్కాలని  ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలోని సమస్యలు గాలికి వదిలి ముఖ్యమంత్రి, మంత్రులు ఊరేగుతున్నారని కెటిఆర్ ధ్వజమెత్తారు. సర్పంచుల కుంటుంబాలు రోడ్డున పడే దాకా ప్రభుత్వం స్పందించదా?,  శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన సర్పంచులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. పల్లె ప్రగతి పేరిట తాము చేపట్టిన కార్యక్రమానికి తూట్లు పొడిచి నిధులు విడుదల చేయకుండా ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన సర్పంచ్ లను వెంటనే విడుదల చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News