Sunday, December 22, 2024

ఏడెనిమిది సీట్లు గెలిస్తే హంగ్ వచ్చేది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గంపై బిఆర్ఎస్ సన్నాహక సమావేశాన్ని ఆదివారం నిర్వహించింది. మల్కాజ్ గిరి పరిధిలోని బిఆర్ఎస్ నేతలతో కెటిఆర్, హరీశ్ రావు సమావేశం అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలపై సమీక్ష, లోక్ సభ ఎన్నికల కార్యాచరణపై భేటీలో చర్చించారు. నేతలు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు, సలహాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ఇంకో ఏడో, ఎనిమిదో సీట్లు గెలిచి ఉంటే హంగ్ వచ్చేదన్నారు. తక్కువ ఓట్లతో గత ఎన్నికల్లో మాల్కాజ్ గిరి ఎపి స్థానంలో ఓడిపోయాని గుర్తుచేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో అబద్దాలు చెప్పి కాంగ్రెస్ గెలిచిందని కెటిఆర్ ఆరోపించారు. కార్యకర్తలు కష్టపడితే మల్కాజ్ గిరిలో ఈసారి విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. 200 యూనిట్లులోపు ఉంటే కరెంట్ బిల్లులు కట్టేపని లేదని సిఎం చెప్పిన విషయాన్ని కెటిఆర్ గుర్తుచేశారు. గతంలో సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలనే నేను గుర్తుచేస్తున్నానని చెప్పుకొచ్చారు. బిల్లులు కట్టొద్దంటే నాది విధ్యంసకర మనస్తత్వం అంటున్నారని తెలిపారు. నిజాలు మాట్లాడితే విధ్వంసకర మనస్తత్వతా? అని ప్రశ్నించారు. కరెంట్ బిల్లులను సోనియాకే పంపుదామని పిలుపునిచ్చారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కాంగ్రెస్ మాట మార్చిందని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News