డిస్ట్రక్షన్.. డిస్ట్రాక్షన్.. డైవర్షన్ పాలిటిక్స్
2024 కాంగ్రెస్ ధోకా నామ సంవత్సరం రైతు భరోసా పేరుతో
సంక్రాంతికి మరో మోసం నాపై పసలేని కేసులు పెట్టారు.. అది సిఎం
రేవంత్‌కు కూడా తెలుసు భయపడేది లేదు.. న్యాయపరంగా
ఎదుర్కొంటాం సినిమా వాళ్లతో సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు నోరు
మెదపడం లేదు : మీడియాతో కెటిఆర్ చిట్‌చాట్
మన తెలంగాణ/హైదరాబాద్ : రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతికి మరో మోసం చేసేందుకు సిద్ధమైందని బిఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. రైతు భరోసాను ఎగ్గొట్టడం, బిసిలను మోసగించడం అనే రెండు ప్రయత్నాలతో 2025 నూతన సం వత్సరాన్ని కాంగ్రెస్ ప్రారంభించబోతుందని వి మర్శించారు. తెలంగాణ భవన్లో సోమవారం కెటిఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కొత్త ఏడాదిలో రైతులను మోసం చేయటానికి సిఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొ ట్టి రైతుల నోట్లో మట్టికొట్టిందని, 26 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా ఎగ్గొట్టడం వల్ల బాకీ పడిందని అన్నారు. రైతు భరోసా ఎవరికి ఇస్తారు అనే విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు.
రూ.72,000 కో ట్లు సాఫీగా రైతుల ఖాతాలోకి పోయిన కార్యక్రమాన్ని గందరగోళంగా మారుస్తున్నదని, అంతిమంగా ఈ వ్యవహారం అవినీతికి దారి తీస్తుంద ని పేర్కొన్నారు. బిసి రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. కాంగ్రెస్ నేతలకు చెందిన వాళ్లతోనే కోర్టులో కేసులు వే యించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిల రిజర్వేషన్లు కోత విధించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎ న్నికల్లో బిఆర్ఎస్ సత్తా చూపిస్తామని పేర్కొన్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. లోకల్ బాడీస్‌లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేవరకు వదిలేది లేదని కెటిఆర్ హెచ్చరించారు.
బిఆర్ఎస్ను మరింత బలోపేతం చేస్తాం
2025 సంవత్సరంలో బిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని కెటిఆర్ వెల్లడించారు. 2024లో బిఆర్ఎస్ పార్టీ కొంత గడ్డు కాలం ఎదుర్కొందని, ప్రతికూలతలను తట్టుకుని నిలబడ్డామని అన్నారు. ఈ ఏడాది చివరకు బిఆర్ఎస్ క్యాడర్లో విశ్వాసం, ఆత్మసైర్యం కన్పిస్తోందని అన్నారు. పార్టీ శిక్షణ కార్యకలాపాలు, సభ్యత్వ నమోదు కార్యకలాపాలు చేపడతామని, అదే సమయంలో పార్టీ అధ్యక్ష ఎన్నిక కూడా ఉంటుందని తెలిపారు. గ్రామంలోని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అన్ని విభాగాల్లో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికల అంశంలో పార్టీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొన్నారు.ఎప్పుడు బయటకు రావాలో తమ అధినేత కెసిఆర్‌కు తెలుసు అని చెప్పారు. కెసిఆర్ 24 ఏళ్లు కష్టపడ్డారని… కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు.
కాంగ్రెస్ ధోకా నామ సంవత్సరంగా 2024
2024 సంవత్సరాన్ని కాంగ్రెస్ ధోకా నామ సంవత్సరంగా చెప్పుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. హామీల అమలులో రేవంత్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని.. కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎల్లో నిరాశ కన్పిస్తోందని చెప్పారు. హామీలపై పెట్టుకున్న డెడ్లైన్లు కాంగ్రెస్‌కు శాపంగా మారాయని విమర్శించారు. కాంగ్రెస్ క్యాడర్ కూడా ప్రశ్నిస్తోందని, ప్రజలు 6 గ్యారెంటీలు గురించి అడుగుతున్నారని క్యాడరే మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు హామీలు, గ్యారంటీలు ఆ పార్టీకి శాపాలై చుట్టుకున్నాయని వ్యాఖ్యానించారు.
సినిమా వాళ్లతో సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు మాట్లాడట్లేదు
కాంగ్రెస్ ప్రభుత్వం డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్, డైవర్షన్ (3 డీ) చేస్తోందని కెటిఆర్ విమర్శించారు. ప్రచారం కోసమే సినిమా వాళ్ల గురించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారని కెటిఆర్ ఆరోపించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నించారని ధ్వజమెత్తారు. అటెన్షన్, డైవర్షన్ కోసమే సిఎం పాకులాడారని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ వ్యవహారంపై కెటిఆర్ స్పందిస్తూ సినిమా వాళ్లతో సెటిట్‌మెంట్ చేసుకొని సిఎం ఇప్పుడు మాట్లాడట్లేదని ఆరోపించారు. గురుకులాల్లో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు, ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ప్రభుత్వ పెద్దలు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు, చేనేతల మరణాలపైనా సిఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని ఉద్ఘాటించారు. అందరికీ కనీసం రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేసులతో భయపెట్టాలని చూస్తోందని, వాటిని న్యాయపరంగా ఎదుర్కొంటామని అన్నారు.
అనుమానాలపైన కాదు.. ఆధారాలపైనే కేసులు ఉంటాయి
అనుమానాలపైన కేసులు ఉండవని, కేవలం ఆధారాలపైన మాత్రమే కేసులు ఉంటాయని కెటిఆర్ పేర్కొన్నారు. తన కేసుల్లో ఇడి దూకుడుగా ఉందన్న ప్రచారం జరుగుతోందని తెలిపారు. ఫార్ములా -ఈ కార్ రేసు కేసుపై ఆయన మరోసారి స్పందించారు. తనకు ఇడి నోటీసులు వచ్చిన మాట వాస్తవమని అన్నారు. తనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పసలేని కేసులు పెట్టరాని మండిపడ్డారు. ఎసిబి కేసులో బలం లేదని సిఎం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు అని పేర్కొన్నారు. ఎసిబి ఎఫ్ఐఆర్ తప్పని హైకోర్టులో క్వాష్ వేశానని అన్నారు. తాను ఆశావాదిని అని, తనకు న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కేసులకు భయపడేది లేదని, కేసులను న్యాయపరంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.ఈ కేసు విషయంలో తాను మాట మార్చినట్లు మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని, ఈ కేసులో మెదటిరోజు చెప్పిన దానికి తాను కట్టుబడి ఉన్నానని తేల్చిచెప్పారు. ఫార్ములా ఈ రేసుకు మంత్రి హోదాలోనే తానే డబ్బులు చెల్లించినట్లు పేర్కొన్నారు. ప్రొసీజర్ ప్రకారం జరగకుంటే.. ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్, ఆర్బిఐ దగ్గరకు ఎందుకు పోలేదని ప్రశ్నించారు. కట్టిన ప్రతి పైసాకు లెక్క ఉందని స్పష్టం చేశారు. డబ్బులు ముట్టినవారిపై కేసులు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. సిఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేకసార్లు వివిధ రకాల కేసులు పెట్టి తనను జైలుకు పంపాలని ప్రయత్నం చేసిందని అన్నారు. అనేక రకాల అంశాలు లేవనెత్తుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ మొత్తం వ్యవహారంలో తమకు డబ్బులు ఎట్లా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవంత్‌రెడ్డికి రక్షణ కవచంలా బిజెపి ఎంపీలు
కాంగ్రెస్ ప్రభుత్వం తమకంటే ఎక్కువగా అప్పులు చేసిందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండా సంవత్సరంలో లక్ష 39 వేల కోట్ల ఆప్పు ఎందుకు చేసిందని అన్నారు. ఒక్క కార్యక్రమం చేపట్టకుండా ఈ అప్పులన్నీ ఢిల్లీకి పంపిస్తున్నారా..? అని ప్రశ్నించారు. అప్పుల కోసమే అప్పులు చేస్తున్నామని ఈ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఆర్ఆర్ఆర్ రోడ్డు గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చిందని, అప్పటి ప్రభుత్వమే క్యాబినెట్లో ఆమోదం కూడా తెలిపిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిందేమీ లేదన్నారు. ఓఆర్ఆర్ లీజు రద్దు చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జమిలి ఎన్నికలతో పెద్దగా నష్టం లేదని, ఇబ్బంది ఉండదని తెలిపారు.అసెంబ్లీలో కూడా సిఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో ఉన్న మంత్రులు రాష్ట్ర అప్పుల పైన ఒక్కొక్క అబద్ధాన్ని అసెంబ్లీలో మాట్లాడారని ఎద్దేవా చేశారు. 420 గ్యారంటీలు అమలు చేసే వరకు వదిలిపెట్టమని స్పష్టం చేశారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ఢిల్లీలో మెమోరియల్ ఏర్పాటు చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.