Wednesday, January 22, 2025

తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌పై కెటిఆర్ ఏమన్నారంటే…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం సాయంత్రం ముగిసింది. అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. 2018లో ఎగ్జిట్ పోల్స్ ఒక్క సంస్థ మాత్రమే సరిగా చెప్పిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. ఆయన తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. 2018లోనూ తెరాసా ఓడిపోతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయని గుర్తుచేశారు.

ఎగ్జిట్ పోల్స్ మాకు వ్యతిరేకంగా ఉండటం ఇదే తొలిసారి కాదన్నారు. 70కి పైగా స్థానాల్లో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ కు అంత శాస్త్రీయ ఉందని అనుకోవట్లేదన్నారు. ఎగ్జిట్ పోల్స్ చూసి కార్యకర్తలు ఆందోళన చెందవద్దని కెటిఆర్ సూచించారు. 80కి పైగా స్థానాలు వస్తాయని అనుకున్నాం, కానీ 70 వస్తాయన్నారు. పోలింగ్ జరుగుతుండగానే ఎగ్జిట్ పోల్స్ సర్వే జరుగుతుందని కెటిఆర్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News