Wednesday, January 22, 2025

కోదండరాంలో ఉన్నదేమిటి… దాసోజులో లేనిదేమిటి?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలకు గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బిఆర్‌ఎస్ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంఎల్‌సిలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణను నామినేట్ చేస్తే రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారని మండిపడ్డారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కోదందరామ్‌ను ఎలా ఆమోదిస్తున్నారని గవర్నర్ ను ప్రశ్నించారు. దాసోజు శ్రవణ్, సత్యనారాయణకు రాజకీయ నేపథ్యం అడ్డంకి అయితే ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరామ్‌నే ఏ రకంగా ఆమోదించారో ప్రజలకు గవర్నర్ చెప్పాలని కెటిఆర్ నిలదీశారు. తెలంగాణ ప్రజలు ఇచ్చే జీతంతోనే గవర్నర్ పని చేస్తున్న విషయం గుర్తించుకోవాలని సూచించారు.

గవర్నర్ సిఎం రేవంత్ రెడ్డికి బాధ్యులు కాదని, తెలంగాణ ప్రజలకు అనే విషయం గుర్తించుకోవాలని చురకలంటించారు. ఎంఎల్‌సి విషయంలోనే బిజెపితో ఉన్న కాంగ్రెస్ ఫెవికల్ బంధం బయటపడిందని, ఈ నామినేషన్ల అంగీకారం కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కును తెలియజేస్తుందనిఎద్దేవా చేశారు. సర్పంచ్‌ల పదవీకాలం పొడిగించాలని డిమాండ్ చేస్తున్నామని, ప్రజాపాలన అంటే ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు చేయాలని.. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ఇంఛార్జ్‌లు కాదని కాంగ్రెస్ తెలుసుకోవాలన్నారు. రాజకీయాల్లో కుసంస్కారం ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు తప్పవని కెటిఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హాలు అమలు చేసే వరకు వెంటపడుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు బిజెపి జాకీలు పెట్టి మద్దతుగా నిలుస్తుందని, మొన్న బిజెపి ఎంపి బండి సంజయ్ కుమార్ బిఆర్‌ఎస్ అంతం చూద్దామన్నారని, నిన్న గుంపు మేస్త్రీ కూడా అదే మాట చెప్పారని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News