Wednesday, January 22, 2025

ఎక్కడ అభివృద్ధి చేయాలో మాకు తెలుసు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని థ్రిల్‌ సిటీలో ఐటి పరిశ్రమల ప్రతినిధుల ముఖాముఖి సమావేశానికి మంత్రి కె టిఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. ఐటి రంగంలో ఇన్నోవేషన్‌ ఎకో సిస్టమ్‌ను అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు.  హైదరాబాద్ లో ఎక్కడ అభివృద్ధి చేయాలో మాకు తెలుసనని, ఐటి పరిశ్రమలున్న ప్రాంతాల్లోనే అభివృద్ధి చేస్తున్నామనడం సరికాదని మంత్రి కెటిఆర్ అన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగూణంగానే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నామని,2023 లో తెలంగాణలో టీ ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తామన్నారు. ఐటి ఉద్యోగాల కల్పనలో బెంగళూరును హైదరాబాద్ దాటి పోయిందని, వ్యాపారవేత్తలు హైదరాబాద్ వైపు ఆకర్షిలవుతున్నారని మంత్రి కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News