Monday, December 23, 2024

ఐటిలో మనమే పెద్దన్న

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటేశామని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఐటి రంగంలో పురోగతి సాధించామని మంత్రి తెలిపారు. ఐటి సెక్టార్ పురోగతితో యువ త ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందని, ఐటీ ఉ ద్యోగులు 30 ఏళ్లలోపే ఇళ్లను కొనేస్తున్నారన్నారు. ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డి ఇనిస్టిట్యూట్‌లో ఏర్పాటు చే సిన అభయ్ త్రిపాఠి స్మారక ఉపన్యాసం కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొని ‘కొత్త రాష్ట్రం సవా ళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు.

ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సమగ్ర, సమీకృత, సమతుల్య అభివృద్ధిని సాధించిందన్నారు. తెలంగాణ ఐటి ఎగుమతులు 2.41 లక్షల కోట్లకు చేరాయని, ఐటి ఉద్యోగులు 9 లక్ష ల మందికి చేరుకున్నారని తెలిపారు. ఐటి సెక్టార్ లో ఉద్యోగాల కల్పనలో రెండేళ్లుగా బెంగళూరును హైదరాబాద్ దాటేసిందని, అన్ని రంగాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని కెటిఆర్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా
హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. 1950 నుంచి 2014 వరకు దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయని, దశాబ్దాల పోరాటం తర్వాత సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్నో సవాళ్లు, సందేహాలు ఉండేవని, తెలంగాణ ఏర్పడితే ఇక్కడ ఇతర ప్రాంతాల వారి భద్రతపై చాలామంది ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారని, ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని, శాంతిభద్రతలు ఎలాంటి విఘాతం కలగలేదని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో 30లక్షలకు పైగా వ్యవసాయ బోర్లు
సిద్దిపేట ఎంఎల్‌ఎగా ఉన్నప్పుడే కెసిఆర్ ప్రతి ఇంటికి తాగునీరు అందించారని కెటిఆర్ గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ పథకం అమలు చేశామన్నారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా వ్యవసాయ బోర్లు ఉన్నాయని, అందుకే కరెంట్ ఎక్కువ అవసరం పడుతుందని ఆయన తెలిపారు. వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల విద్యుత్‌ను ఉచితంగా అందజేస్తున్నామని కెటిఆర్ తెలిపారు.

కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం
ప్రపంచంలోనే ఎత్తయిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని కెటిఆర్ చెప్పారు. కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమయ్యిందన్నారు. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. మిషన్ భగీరథ లాంటి పథకాలను ఇతర రాష్ట్రాలు, కేంద్రం కాపీ కొడుతున్నాయని కెటిఆర్ పేర్కొన్నారు.

మోడీ నయా పైసా ఇవ్వలేదు
విభజన చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదని కెటిఆర్ తెలిపారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి ఎన్నో అంశాల్లో మద్దతు ఇచ్చామని, నీతి ఆయోగ్ చెప్పినా మోడీ సర్కార్ తెలంగాణకు నయా పైసా ఇవ్వలేదని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి మనం రూపాయి ఇస్తే 46 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయని, ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కెటిఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News