Monday, December 23, 2024

రేప్‌లు చేసిన మైనర్లకు కూడా పెద్దలకు విధించే శిక్షలనే విధించాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR Comments on Jubilee Hills Rape Case

మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో మైనర్‌బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించాలని జూబ్లీహిల్స్ పోలీసులు జువైనల్ కోర్టును కోరే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోలీసుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. అత్యాచారం వంటి అత్యంత దుర్మార్గమైన నేరాలకు పాల్పడే వారికి మేజర్లకు విధించే శిక్షలనే విధించాలన్నారు.

KTR Comments on Jubilee Hills Rape Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News