Monday, December 23, 2024

రైతుల అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరని, బెదిరింపులతో రైతులను భయపెట్టలేరని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఘాటు విమర్శలు చేశారు. లగచర్ల గ్రామంలో రైతుల అరెస్టుపై తన ట్విట్టర్ లో కెటిఆర్ స్పందించారు. అర్దరాత్రి 300మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేస్తారా?, రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా? ఇదేనా ప్రజాస్వామ్య పాలనా? రైతు సంక్షేమ పాలన? అని ప్రశ్నించారు. ఇదేనా వెలుగులను తరిమేసి.. చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం?, అర్దరాత్రి అన్నదాతల అరెస్టులు ఎందుకు? అని అడిగారు. ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి.. పచ్చని పొలాలను వల్లకాడు చేయవద్దన్నందుకు రైతుల అరెస్టు చేస్తారా? అని నిలదీశారు. ‘మీ అల్లుడు, సోదరుల సంపాదనల కోసం.. భూమిని నమ్ముకున్న మా పొట్ట కొట్టవద్దన్నందుకు రైతులను అరెస్టు చేస్తారా?’ అని ధ్వజమెత్తారు. రైతుల అరెస్టులను ఖండిస్తున్నామని కెటిఆర్ స్పష్టం చేశారు. పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తున్నామని, లగచర్ల గ్రామస్తుల పోరాటానికి బిఆర్ఎస్ అండగా ఉంటుందని కెటిఆర్ హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం, వికారాబాద్ జిల్లా, కొడంగల్‌లోని దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ఉద్దేశించి అధికారులు చేపట్టిన భూసేకరణ ప్రజాభిపాయ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత, రణరంగంగా మారింది. భూ సేకరణ ప్రజాభిప్రాయ కార్యక్రమానికి వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో సహా పలువురు అధికారులను రైతులు పరుగెత్తించారు. రాళ్ళు, కర్రలతో దాడికి తెగబడ్డారు. ఒక దశలో విచక్షణ కోల్పోయిన రైతులు అధికారులపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. అధికారుల వాహనాలను రాళ్ళు, కర్రలతో ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

ఫార్మాతో ఇక్కడి నేల, నీరు విషతుల్యమవుతుందని, ఇక్కడ నివసించే ప్రజలు, జంతువులు, పశు పక్షాదుల జీవన ప్రమాణాలపై తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని రైతులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీల ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News