Sunday, November 24, 2024

ఇది ప్రజా పాలన కాదు..ప్రజలు తిరగబడుతున్న పాలన:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ప్రజా పాలన కాదు…ప్రజలు తిరగబడుతున్న పాలన…ఏడాదిలోనే ఎదురీదుతున్న పాలన అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. ఆంక్షలు పెట్టి.. ప్రజాకాంక్షలను తొక్కేస్తామంటే.. తెలంగాణ నేల ఊరుకోదు.. తిరగబడుతుంది.. తరిమికొడుతుంది తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఫార్మా రైతులకు న్యాయం చేస్తామని కల్లిబొల్లి కబుర్లు చెప్పినోళ్లు…రేవంత్..సెక్యూరిటీ లేకుండా నీ సొంత జిల్లా దుద్యాల మండలంకు వచ్చే దమ్ముందా..? అని ప్రశ్నించారు. మీ మోసాలకు అధికారులను ఎందుకు బలిపశువులు చేస్తారు..? అని అడిగారు.

అధికారులు దెబ్బలు తినాల్సి రావడం దురదృష్టకరం
రాష్ట్రంలో పరిపాలనా వైఫల్యం, శాంతిభద్రతల వైఫల్యానికి తాజా ఉదాహరణ రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్‌లో ఏకంగా జిల్లా కలెక్టర్ మీదనే తిరగబడ్డ రైతులు అని కెటిఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మూర్ఖత్వం వల్ల అధికారులు దెబ్బలు తినాల్సి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. నిజానికి రేవంత్ రెడ్డి దురాశ వల్ల, అవగాహనారాహిత్యం వల్లనే ఈ దుస్థితి దాపురించిందని పేర్కొన్నారు. భూసేకరణ పూర్తయ్యి, అన్ని అనుమతులు వచ్చి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫార్మా సిటీని రద్దు చేసి,

రాష్ట్రంలో పది చోట్ల ఫార్మా క్లస్టర్లు పెట్టాలనే తుగ్లక్ అలోచన వల్లనే ఇంత అలజడి రేగిందని అన్నారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములు అమ్ముకొని సొమ్ము చేసుకుందామన్న రేవంత్ కుత్సిత బుద్ధి వల్ల ఇప్పుడు ఇక్కడ ఫార్మా సిటీ భవితవ్యం ప్రమాదంలో పడింది, అక్కడ కొడంగల్‌లో అన్నదాతల భూములు గుంజుకునే కుట్ర మొదలైందని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, ఆగ్రహం, చాలాచోట్ల కట్టలు తెంచుకుంటోందని, అది ఈ అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని త్వరలోనే భూస్థాపితం చేయనుందని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News