Friday, January 3, 2025

రైతుబంధుకు బై చెప్పి రుణమాఫీ నాటకం

- Advertisement -
- Advertisement -

రుణమాఫీ పేరిట రేవంత్ సర్కార్ మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తున్నదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రు.7000 కోట్లు రుణమాఫీకి దారిమళ్లించారని పేర్కొన్నారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుండి కొంతమొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నమని ఫోజులు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 లక్షల పైచిలుకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు.

2014, 2018లో కెసిఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హతనా..? అని నిలదీశారు. 2014లోనే కెసిఆర్ సర్కార్ లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి రూ. 16,144 కోట్లు వెచ్చించి సుమారు 35 లక్షల రైతులకు లబ్ది చేకూర్చిందని తెలిపారు. 2018లో అదే లక్షలోపు రుణమాఫీకి రూ. 19,198 కోట్లు అంచనా కాగా, మొత్తం లబ్దిదారుల సంఖ్య సుమారు 37 లక్షలు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ మానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రూ. 2 లక్షల వరకూ ఉన్న పంటరుణాలు అన్నీ వెంటనే మాఫీ చేయాలని, అర్హులైన అందరు రైతులకూ రైతుబంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News