Thursday, January 23, 2025

ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎందుకు ఎదగడంలేదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మంత్రి కెటిఆర్ తెలిపారు.
హెచ్‌ఐసిసిలో జరిగిన ఎన్‌హెచ్‌ఆర్‌డిఎన్ 25వ నేషనల్ కాన్ఫరెన్స్‌లో కెటిఆర్ మాట్లాడారు. పేదలకిచ్చే పథకాలను అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. కొందరి చేతిలోనే డబ్బులు ఉండేలా మోడీ ప్రభుత్వం పని చేస్తుందని దుయ్యబట్టారు. అన్ని రాష్ట్రాలకు పాధాన్యత ఇస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. దేశంలో గొప్ప నాయకులందరూ గెలుపును మాత్రమే చూస్తున్నారని, అభివృద్ధిని మాత్రం పక్కన పెట్టారన్నారు. మన దేశంలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. చైనా, జపాన్ వంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయన్నారు. ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలనే ఆలోచన ఎందుకు రావడంలేదని కెటిఆ ప్రశ్నించారు. బడ్జెట్‌లో దేశ అభివృద్ధికి సంబంధించిన కేటాయింపులు కనిపించడం లేదని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News