Monday, December 23, 2024

అక్కడ మోడీ, ఇక్కడ బోడీలకు భయపడం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలలో గెలిచేది టిఆర్ఎస్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కెటిఆర్ తెలిపారు. మునుగోడులో ఉప ఎన్నిక రావడానికి కారణం ఓ కాంట్రాక్టర్ బలుపే కారణమని మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ వి సమావేశంలో కెటిఆర్ ప్రసంగించారు. మునుగోడు ప్రజలను అంగట్లో సరుకుగా కొనడానికి బిజెపి నేత రాజగోపాల్ రెడ్డి రెడీగా ఉన్నాడన్నారు. మోడీ అహంకారంతో ఈ ఉపఎన్నిక వచ్చిందన్నారు.  ఓ వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే మునుగోడు బాగు పడ్డట్టు కాదన్నారు. నిన్న తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి ఒక మాట చెప్పారని,  రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్టు ఇచ్చిన మొత్తాన్ని మునుగోడు అభివృద్ధికి ఉపయోగిస్తామని కేంద్రం హామీ ఇస్తే టిఆర్ఎస్ ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటుందని మంత్రి జగదీష్ రెడ్డి సవాలు విసిరిన విషయాన్ని కెటిఆర్ గుర్తు చేశారు.

వర్కింగ్ ప్రెసిడెంట్ గా జగదీష్ రెడ్డి మాటలతో తాను ఏకీభవిస్తున్నానన్నారు. 18 వేల కోట్ల రూపాయలు మునుగోడుకు మోడీ ప్రకటిస్తే టిఆర్ఎస్ ఉపఎన్నికల బరి నుంచి తప్పుకుంటుందన్నారు. మాకు అసెంబ్లీలో 105 సీట్ల బలం ఉందని, ఒకటి రెండు సీట్లతో ఒరిగేదేమీ లేదన్నారు.  కోమటి రెడ్డి సోదరులు కోవర్టు రెడ్డిలుగా మారారని కెటిఆర్ దుయ్యబట్టారు. మునుగోడులో కాంగ్రెస్, బిజెపిలు ఒక్కటయ్యాయని కోమటి రెడ్డి వెంకటరెడ్డి విదేశాలకు వెళ్తున్న తీరే నిదర్శనమన్నారు. అక్కడ మోడీ, ఇక్కడ బోడిలకు భయ పడే వారు తెలంగాణలో ఎవ్వరూ లేరన్నారు. తెలంగాణ కోసం చావనైనా చస్తాం కానీ మోడీకి భయపడే ప్రసక్తే లేదన్నారు. దమ్ముంటే రాజగోపాల్ రెడ్డి స్వచ్చందంగా 18 వేల కాంట్రాక్టును వదులుకోవాలని సవాలు విసిరారు. ఈ కాంట్రాక్టులో మతలబు లేదని యాదాద్రిలో ప్రమాణం చేయాలన్నారు. భాగ్యలక్ష్మి గుడి దగ్గర బండి సంజయ్ గుండు మీద రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టులో మతలబు లేదని ప్రమాణం చేయాలన్నారు. ఈ కాంట్రాక్టుపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తో రాజగోపాల్ పై విచారణ చేపట్టాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News