Monday, January 13, 2025

కార్పొరేట్ మిత్రుల కోసం రూ.12.5 లక్షల కోట్లు మాఫీ ఎందుకు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్రమే వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆర్థిక సాయం చేయాలని, విశాఖ ప్లాంట్ నుంచి స్టీల్ ఉత్పత్తుల కొనాలని మంత్రి కెటిఆర్ తెలిపారు. మోడీ ప్రభుత్వానికి మంత్రి కెటిఆర్ లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానుకోవాలని సూచించారు. వర్కింగ్ క్యాపిటల్, నిధులు సమీకరణ పేరుతో ప్లాంట్‌ను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్రకు తెరలేపుతున్నారని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనాన్ని పరిశీలించాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వెంటనే ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బిఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటానికి పిఎస్‌యు కార్మికులు కలిసి రావాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. కార్పొరేట్ మిత్రుల కోసం రూ.12.5 లక్షల కోట్లు ఎందుకు మాఫీ చేశారని ప్రశ్నించారు. అదే ఔదార్యం విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఎందుకు లేదని అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News