- Advertisement -
హైదరాబాద్: కేంద్రంపై మంత్రి కెటిఆర్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. సాధారణ ప్రజలు పాలు, పెరుగుపైనా జిఎస్‌టి కట్టాలని చురకలంటించారు. అదానీ లాంటి వాళ్లు ఎయిర్‌పోర్టులు పొందినా జిఎస్‌టి లేదని, మిత్రులకు ఇవ్వటం ఉచితం కాదంట.. ఇది కేవలం ” ఎ మిత్ కాల్ “అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఇది “అమృత్ కాల్ కాదని, ఏ మిత్ర్ కాల్” అని మండిపడ్డారు. 30 శాతం కేంద్ర ప్రభుత్వ అవార్డులు పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే వచ్చాయని కెటిఆర్ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. పంచాతీయ రాజ్ దినోత్సవం సందర్భంగా దేశంలో మూడు శాతం కంటే తక్కువ జనభా కలిగిన తెలంగాణ రాష్ట్రం అవార్డులు తీసుకోవడంతో ముందంజలో ఉందని కెటిఆర్ కొనియాడారు.
- Advertisement -