Monday, January 20, 2025

మోడీ ప్రియమైన ప్రధాని కాదు, పిరమైన ప్రధాని: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మోడీ హయాంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ముడిచమరు ధరలు తగ్గినా పెట్రో ధరలు మాత్రం తగ్గడం లేదని, పెట్రోల్, డీజిల్ ధరలు 34 శాతం పెంచారని , చమురు ధరల పెంపుతో రూ. 30 లక్షల కోట్లు వసూలు చేశారని మండిపడ్డారు.
15 లక్షల కోట్లు అదానీ, అంబానీకి రుణమాఫీ చేశారని, తాను చెప్పింది తప్పని నిరూపిస్తే ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేస్తానని కెటిఆర్ సవాల్ విసిరారువ. మోడీ ప్రియమైన ప్రధాని కాదు అని, పిరమైన ప్రధాని అని ఎద్దేవా చేశారు. అబ్ కీ బార్ నినాదంతో బిజెపి ముందుకు వస్తోందని, ఈ సారి బిజెపి వస్తే పెట్రోల్ ధరలు రూ.400 కు చేరుతుందని విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News