Thursday, September 19, 2024

శ్రీధర్ బాబు లాజిక్ ప్రకారం…. రేవంత్ టిడిపిలో ఉన్నారా? : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కర్నాటకలో సంవత్సరంలో మూడుసార్లు పాల ధరను కాంగ్రెస్‌ ప్రభుత్వం పెంచిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. ఏకంగా గంజాయి అమ్మడానికి పర్మిషన్‌ కావాలని హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్జీ పెట్టుకుందని చురకలంటించారు. వంద రోజులు, ఆరు గ్యారెంటీల డ్రామాలతో ఎన్ని రోజులు గడుపుతారని దుయ్యబట్టారు. అడ్డగోలు హామీలు, కల్లబొల్లి మాటలతో ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారని ధ్వజమెత్తారు.

బిఆర్ఎస్ ఎంఎల్ఎ పాడి కౌశిక్ రెడ్డి, పిఎసి చైర్మన్ అరెకపూడి గాందీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు బిఆర్ఎస్ ఎంఎల్ఎల మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై నెడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు అనడంతో కెటిఆర్ ట్వీట్ చేశారు. అతి తెలివి మంత్రి శ్రీధర్ బాబు లాజిక్ ప్రకారం సిఎం రేవంత్ రెడ్డి కూడా ఇంకా టిడిపిలోనే ఉన్నారా? కాంగ్రెస్ లో ఉన్నారా? అని కెటిఆర్ ప్రశ్నించారు.

బిఆర్ఎస్ ఎంఎల్ఎ ఇళ్ల చుట్టు తిరిగి కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారని సన్నాసి ఎవరు?.. సిగ్గులేకుండా ఇంత నీతిమాలిన రాజకీయం ఎందుకు? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ఎంఎల్ఎలను కాంగ్రెస్ లో ఎందుకు చేర్చుకున్నారని, తరువాత పదవులు పోతాయి అన్న భయంతో ఈ నాటకాలు ఎందుకు అని కెటిఆర్ అడిగారు. కాంగ్రెసోళ్లు ప్రలోభపెట్టి చేర్చుకున్న వాళ్ళను తమ వాళ్ళని చెప్పుకోలేని బాధను చూస్తే జాలి కలుగుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకుల అతి తెలివితో హైకోర్టును మోసం చేద్దాం అనుకుంటున్నారని, అన్నీ ప్రజలు గమనిస్తున్నారని కెటిఆర్ దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News