Saturday, September 21, 2024

ఆ కంపెనీకి రూ.1000 కోట్ల పనులు ఎలా అప్పగిస్తారు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అమృత్ పథకంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతి చేశారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపణలు చేశారు. అమృత్ పథకం టెండర్ల అవినీతిపై కేంద్రానికి లేఖ రాశామని వివరించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించి బావమరిదికి పనులు అప్పగించారని, సిఎం బావమరిది కంపెనీకి రూ.1137 కోట్ల పనులు అప్పగించారని, రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీ రూ. వెయ్యి కోట్లు విలువైన పనులు చేస్తుందా? అని కెటిఆర్ ప్రశ్నించారు.

అమృత్ పథకంలో జరిగిన టెండర్ల వివరాలను ప్రభుత్వం బయట పెట్టడంలేదని, అమృత్ పథకం టెండర్లపై కేంద్రం విచారణ జరిపించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు జరిగిన అమృత్ పథకం టెండర్లను రద్దు చేయాలన్నారు. బిజెపి, కాంగ్రెస్ కలిసి లేకుంటే అమృత్ పథకం టెండర్లపై విచారణ చేయాలని, ఫిబ్రవరి నుంచి జీవోలను వెబ్‌సైట్లలో ఎందుకు పెట్టడంలేదని ప్రశ్నించారు. హైడ్రాను అడ్డుపెట్టుకొని ఎలా బెదిరిస్తున్నారో బయటపెడుతామని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అక్రమాలన్నీ బయటపెడుతామని, బిజెపి అనుకుంటే సిఎం రేవంత్ రెడ్డి పదవి పోతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News