Saturday, December 21, 2024

రేవంత్ ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడు అనిపిస్తుంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడు అనిపిస్తుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చురకలంటించారు. కెటిఆర్ తన ట్విట్టర్ లో రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నియామకాలపై మరీ ఇంత నీతిమాలిన ప్రచారం అవసరమా? అని మండిపడ్డారు. ప్రజాధనాన్ని తగలేసి ఫ్రంట్ పేజీల్లో పచ్చి అబద్ధాలతో ప్రకటనలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ ఉద్యోగాలను కాంగ్రెస్‌ ఖాతాలో వేసుకోవడానికి కొంచెమైనా సిగ్గుండాలి కదా అని ప్రశ్నించారు. తెలంగాణ యువతను రేవంత్ రెడ్డి పిచ్చోళ్లను చేస్తున్నారని, అశోక్ నగర్ చౌరస్తాకు..ఉస్మానియా క్యాంపస్‌కు పోయి చెబుతావా? కొలువుల పండుగ కథలు అని ధ్వజమెత్తారు. ఏడాదిలో 2 లక్షల కొలువులు గ్యారెంటీ ఏమైందని నిలదీశారు. నిరుద్యోగుల చెవుల్లో పువ్వులు పెట్టింది చాలక, తప్పుడు లెక్కలతో తప్పుదోవ పట్టించడం దుర్మార్గమని కెటిఆర్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News