Wednesday, December 25, 2024

ఆయన చెప్పులు మోసిన నాడు…. ఉద్యమానికి కెసిఆర్ ఊపిరి పోశాడు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి చెప్పులు మోసిన నాడు.. బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమానికి ఊపిరి పోశారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. రేవంత్ పదవుల కోసం పరితపిస్తున్న నాడు, కెసిఆర్ ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేశాడని, నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కుపెట్టిన నాడు, ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడని, నువ్వు సాధించుకున్న తెలంగాణను చంపేటందుకు బ్యాగులు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్ కు ఊపిరి పోశారని, తెలంగాణ చరిత్రలో కెసిఆర్ పేరును తుడిచేది? నువ్వా అని రేవంత్ పై కెటిఆర్ విమర్శలు గుప్పించారు.

మూసీ ముందుకు వెళ్తోందని.. ధాన్యం కొనుగోళ్లు వెనక్కు వెళ్తున్నాయని ధ్వజమెత్తారు. రామన్నపేటకు రైట్ రైట్ – కొనుగోలు సెంటర్లకు నై నై అని, దామగుండానికి ధనాధన్ – ధాన్యం కొనుగోళ్లు ఢాం ఢాం అని,  కొనుగోళ్లకు దిక్కులేదు -కాంగ్రెస్ కోతలకు లెక్క లేదని కెటిఆర్ చురకలంటించారు. దళారులకు దండుకుంటుండగా రైతన్నలు దగాపడుతున్నారని,  కెసిఆర్ ప్రభుత్వంలో క్వింటాకు 2300 అమ్ముకున్న రైతు… రేవంత్ పుణ్యమా? అని రూ 1800 లకు అమ్ముకుంటున్నాడని, ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడదని కెటిఆర్ దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News