Sunday, December 22, 2024

మూసీ దాహానికి అత్తాపూర్ ఆగమైంది…. గోల్నాక గొల్లుమంది: కెటిఆర్

- Advertisement -
హైదరాబాద్: మోకాలికి దెబ్బ తగిలితే బోడి గుండుకు కుట్లు వేసినట్టుగా గుంపు మేస్త్రీ పాలన ఉందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో మూసీ బాధితులు ఉంటే, నల్గొండలో మూసీ పరివాహక ప్రాంత రైతులను కలవడంలో సిఎం రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. కూల్చిన ఇండ్లెక్కడ – కాలిన కడుపులెక్కడ సిఎం తిరుగుతున్న ప్రాంతం ఎక్కడ ?.. ఆగిన గుండెలెక్కడ – రగిలిన మనసులెక్కడ .. రేవంత్ చేసిన ఎర్ర రంగు మార్కింగ్ ఎక్కడ – నువ్ చేస్తున్న పాదయాత్ర ఎక్కడ ? అని కెటిఆర్ అడిగారు. రేవంత్ కుట్రలకు అంబర్ పేట్ – అత్తాపూర్ అతలాకుతలం అవుతుందని,  సిఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఎక్కడ జరుగుతున్నాయన్నారు. మూసి దాహానికి అత్తాపూర్ ఆగమైందని, గోల్నాక గొల్లుమంటుందని, దిల్ షుక్ నగర్ ఢీలా పడిందని కెటిఆర్ విమర్శించారు.
అయ్యా సంబరాల రాంబాబు ‘నీ అన్యాయానికి.. అవేదనలు, ఆవేశాలు, అక్రాందనాలు వినిపిస్తున్నవి కనిపిస్తున్నవి అక్కడ కాదు.. ఇక్కడ పాదయాత్ర చేయాలి’ అని సవాల్ విసిరారు. తేలు మంత్రం రానోడు .. పాము కాటుకు మంత్రం వేసినట్లు .. పాలన తెయని. రేవంత్ కు  పగ్గాలు అప్పగిస్తే ప్రజల బతుకుళ్లో మనుపోశావని మండిపడ్డారు. నాయకత్వం అంటే కూల్చడం కాదు అని నిర్మించడం అని, నాయకత్వం అంటే దారి తప్పడం కాదు అని దారి చూపడం అని కెటిఆర్ చురకలంటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ చేస్తున్న మూసి పాదయాత్ర నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీ  ప్రజాప్రతినిధులు, నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News