Thursday, April 3, 2025

8 మందిని బలిపీఠం ఎక్కించి… ‘గ్రాడ్యుయేట్స్’కు గాలం

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రిపై కెటిఆర్ ధ్వజం

మనతెలంగాణ/హైదరాబాద్: ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది ఆచూకీ తెలియని ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎంఎల్‌సి ఎన్నికల ప్రచారంలో ముని గితేలడం దిగజారుడు రాజకీయమే అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా విమర్శిం చారు. జరిగిన ఘోర దుర్ఘటనపై ముఖ్యమంత్రికే సీరియస్‌నెస్ లేకపోతే, ఇక అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటుంది… రెస్క్యూ ఆపరేషన్ ఎలా ముందుకు సాగుతదని ప్రశ్నించారు. ఓట్ల వేటలో జిల్లాలకు జిల్లాలు చుట్టి వచ్చేందుకు ముఖ్యమంత్రికి సమ యం ఉంది కానీ.. ఒక్కసారి క్షతగాత్రుల ఆర్థనాదాలతో మిన్నం టుతున్న ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌కు వెళ్లే టైమ్ లేదా..? అని నిలదీ శారు.

ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా.. ప్రజాపాలన అంటే నోట్ల వేట.. ఓట్ల వేట మాత్రమేనా..? అని అడిగారు. ఓవైపు సహాయక చర్యలు కొలిక్కి రాకముందే, ఇరుక్కున వారు బతికుండే అవకాశం కనిపించడం లేదని సర్కారు చేతులెత్తేస్తున్న తీరు, మరోవైపు సహాయక చర్యలను పర్యవేక్షించి, బాధితుల కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్య త మరిచి ఎన్నికలే తమ తొలి ఎజెండా అనే సిఎం అని మండిపడ్డారు. సర్కారుకు కనీస మానవత్వం కూడా లేదా..? అని ప్రశ్నించారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిం చినట్టు, ఎనిమిది మందిని బలిపీఠం ఎక్కించి గ్రాడ్యూయేట్స్‌కు గాలం వేసేందుకు సిద్ధమైన సిఎంను తెలంగాణ ప్రజలు గమనిస్తు న్నారని, సరైన సమయంలో కాంగ్రెస్‌కు కర్రుగాల్చి వాత పెడ్తారు…జై తెలంగాణ అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News