Tuesday, January 21, 2025

కాంగ్రెస్‌కు మరో ఆరు నెలలు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మాజీ మంత్రి కెటిఆర్ తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా ఓ ట్వీట్‌ను రీపోస్ట్ చేశారు. కౌలు రైతులను ఎట్ల గుర్తిస్తారో.. పైసలు ఎట్లా వేస్తారో చూద్దామని అనుకుంటే.. వీళ్లు ఆరు నెలలు తప్పించుకున్నారు గా? అని సృష్టి అనే ట్విట్టర్ హ్యాండిల్ పేర్కొంది. అంటే.. ఈ యాసంగికి 22 లక్షల మంది కౌలు రైతులకు పెట్టుబడి సాయం లేనట్టేనా? అని ప్రశ్నించిం ది. ఇప్పుడు కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందనందుకు ముఖ్యమంత్రి మరో బహిరంగ లేఖ రాస్తాడా? అని అడిగింది. ఈ ట్వీట్‌ను కెటిఆర్ రీపోస్ట్ చేశారు. మళ్లీ వచ్చే పసలు వరకు రైతు భరోసా నిధుల పంపిణీ ఉండదు. అంటే మరో ఆరు నెలల వరకు కాంగ్రెస్‌కు సమయం దొరికినట్టేనన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News