Thursday, January 9, 2025

ప్రభుత్వ వెబ్‌సైట్లు, డిజిటల్ విధ్వంసం…. చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళ్తాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత ప్రభుత్వ సమాచారం, వివరాలు తెలంగాణ ప్రజల ఆస్తి అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ప్రభుత్వ వెబ్‌సైట్లు, డిజిటల్ విధ్వంసంపై ఎక్స్‌లో కెటిఆర్ స్పందించారు. తక్షణమే జోక్యం చేసుకోవాలని సిఎస్ శాంతికుమారిని కోరారు. కెసిఆర్ హయాంలోని సమాచారం, వివరాలు ఎందుకు తొలగించారని అడిగారు. భావితరాల కోసం ఈ డిజిటల్ సంపదను రక్షించాలని డిమాండ్ చేశారు. తగిన చర్యలు తీసుకోకుంటే న్యాయపరంగా ముందుకు వెళ్తామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News