Sunday, January 19, 2025

వైద్య రంగంలో కెసిఆర్ చేసిన అభివృద్ధి ఓ అరుదైన విప్లవం : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సర్కారు దవాఖానాకు నేను రాను బిడ్డో అనే దుస్థితి నుంచి ప్రభుత్వ దవాఖానాలోనే మెరుగైన వైద్యం అందుతుంది అనే ధీమాను ప్రజలకు కెసిఆర్ కల్పించారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. హ్యాష్ ట్యాగ్ తెలంగాణ దశాబ్ది అంటూ పోస్టు చేసిన కెటిఆర్ జననం నుంచి మరణం దాకా ప్రతి దశలో మన సర్కారు ఉన్నదన్న భరోసా బిఆర్‌ఎస్ కల్పించిందన్నారు. కెసిఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, డయాలసిస్ సెంటర్లు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు, బస్తీ దవాఖానలు, మాతాశిశు ఆసుపత్రులను అభివృద్ధి చేశామని అన్నారు. నగరం నలుమూలలా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వరంగల్‌లో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రికి శ్రీకారం చుట్టిన ఘనత కెసిఆర్‌దేనని పేర్కొన్నారు. మరే రాష్ట్రంలో లేనన్ని మెడికల్ సీట్లు తీసుకువచ్చామని అన్నారు. ఒకటా..? రెండా..? కెసిఆర్ పాలనలో వైద్య ఆరోగ్య రంగం దేశ చరిత్రలోనే ఓ అరుదైన విప్లవం అని వ్యాఖ్యానించారు.

ఆర్‌టిసి కొత్త లోగో చూపుతున్న కాంగ్రెస్ వాళ్లపై కేసులేవీ : కెటిఆర్
టిఎస్‌ఆర్‌టిసి కొత్త లోగో ప్రచారం విషయంలో బిఆర్‌ఎస్ నాయకులు, మద్దతుదారులపై కేసులు నమోదు చేయడం పట్ల బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా సీరియస్‌గా స్పందించారు. కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న మీడియా సంస్థలపై ఎందుకు పెట్టలేదని డిజిపి రవి గుప్తా, ఆర్‌టిసి ఎండి విసి సజ్జనార్‌కు కెటిఆర్ ప్రశ్నించారు. ఆర్‌టిసి కొత్త లోగో అంటూ ప్రచారం చేసిన ఎన్‌టివి, బిగ్ టివి చానెల్స్, వెలుగు దినపత్రికపై కేసులు ఎందుకు పెట్టలేదని అడిగారు. రాజకీయ పెద్దల మాటలు విని వేధిస్తే కోర్టుకు లాగుతామంటూ కెటిఆర్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News