Tuesday, September 17, 2024

రైతులు, జర్నలిస్టులపై దాడులు ఆపండి: డిజిపికి కెటిఆర్ ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

మా సహనాన్ని పరీక్షిస్తే… చర్యకు ప్రతి చర్య తప్పదు
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
బిఆర్‌ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణుల దాడులపై
డిజిపి జితేందర్‌కు కెటిఆర్ ఫిర్యాదు
మనతెలంగాణ/హైదరాబాద్: తమ సహనాన్ని పరీక్షిస్తే.. చర్యకు ప్రతిచర్య తప్పదు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని సిఎం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని సూచించారు. బిఆర్‌ఎస్ కార్యకర్తలు, మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దాడులపై పోలీసు నిర్లక్ష్య వైఖరిపై బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, పార్టీ సీనియర్ నాయకులతో కలిసి కెటిఆర్ శుక్రవారం రాష్ట్ర డిజిపి జితేందర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థి నాయకుడు, తుంగతుర్తి మాజీ ఎంఎల్‌ఎ గాదరి కిషోర్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్దతిలో శాంతియుతంగా తిరుమలగిరిలో రైతు నిరసన దీక్ష కార్యక్రమం చేస్తుండగా, 50 మంది కాంగ్రెస్ గుండాలు, తాగిన మత్తులో ఆకస్మికంగా రాళ్లు, గుడ్లు, సుతిలి బాంబులతో దాడి చేశారని అన్నారు. తమ వాళ్లు తిరగబడి ఉంటే ఆ 50 మంది కాంగ్రెస్ మూకలు ఒక్కరు కూడా మిగిలేవారు కాదని పేర్కొన్నారు. కానీ శాంతియుతంగా తాము నిరసన తెలుపాలని భావించామని, అందుకే ఎలాంటి ప్రతిఘటనకు పాల్పడలేదని చెప్పారు. పోలీసులే తమ నిరసన దీక్షకు సంబంధించిన టెంట్ కూల్చేయటం ఆశ్చర్యం కలిగించిదని అన్నారు.

మంచిర్యాలలో ఎంఎల్‌ఎ కారణంగాత్మ నాయకుడు గొంతు కోసుకున్నారని పేర్కొన్నారు. మొత్తంగా వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఈ ముఖ్యమంత్రి అధికారం చెలాయించాలనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదని అన్నారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, నెల రోజుల్లో 28 హత్యలు అనే వార్తలు వస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినవద్దనే తాము ఇప్పటి వరకు ఊరుకుంటున్నామని, తమ సహనాన్ని, చేతగాని తనం అనుకోవద్దని అన్నారు. కొంతమంది పోలీసులు మంత్రుల బర్త్ డే కార్యక్రమాల్లో పరవశించి పోతున్నారని, ఇలాంటి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని డిజిపికి ఫిర్యాదు చేశామన్నారు. తమ పార్టీ నాయకులపై జరిగిన దాడికి సంబంధించి ఆధారాలతో సహా టిజిపికి ఫిర్యాదు చేశామని తెలిపారు.

పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు: శాటిలైట్ ఇమేజ్‌లు ఉన్నాయి
ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ల పరిధిలో అక్రమంగా ఉన్న భవనాలన్నీ కూల్చాల్సిందే అని, నేతల భవనాలను కూల్చిన తర్వాత సామాన్యులవి కూల్చాలని కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. తన ఇల్లు బఫర్ జోన్ పరిధిలోని లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారని ఓ మీడియా ప్రతినిధి కెటిఆర్‌ను ప్రశ్నించగా.. పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు అని, ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి శాటిలైట్ మ్యాప్స్ ఉన్నాయని బదులిచ్చారు.

మంత్రి పొంగులేటి ఎలా చెరువులు పూడ్చి కట్టారో అవన్నీ కూడా శాటిలైట్ ఇమేజేస్ ఉన్నాయని, ఈ విషయంలో ఆయన అంత బాధపడాల్సిన అవసరం కూడా లేదని పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో మాట్లాడుకుని, ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాలను మొదట కూల్చడం ప్రారంభించాలని అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్, కెవిపి రామచంద్రరావు, మధుయాష్కీ, గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి నేతల భవనాలను కూల్చేసి ఆ తర్వాత సామాన్యుల భవనాలను కూల్చేయాలని కెటిఆర్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News