Friday, January 24, 2025

ఆ నేరస్థులకు అత్యంత కఠిన శిక్ష విధించాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చోటుచేసుకున్న హత్యపై రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ స్పందించారు. ఉదయ్‌పూర్ హత్య ఘటన చాలా బాధాకరమని ట్విట్టర్‌లో మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి అనాగరిక హింసకు సమాజంలో చోటు లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపాలని సూచించారు. నేరస్థులకు అత్యంత కఠిన శిక్ష విధించాలని ట్విట్ చేశారు.
ఉదయ్‌పూర్‌లో ఏం జరిగిందంటే..
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ధన్ మండీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ టైలర్‌ను ఇద్దరు నిందితులు దారుణంగా హత్య చేశారు. తొలుత ఓ నిందితుడు టైలర్‌పై పదునైన ఆయుధంతో తల నరకగా ఈ దుశ్చర్యను మరో నిందితుడు తన మొబైల్ ఫోన్‌లో వీడియో రికార్డు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కాసేపటి తర్వాత తామే ఈ హత్య చేసినట్టు అంగీకరిస్తూ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. సామాజిక మాధ్యమాల్లో రెండు వర్గాల మధ్య కొనసాగిన పోస్ట్‌లతో టైలర్ హత్యకు సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ మర్డర్ ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని, పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని అధికారులు తెలిపారు. టైలర్ సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్‌కు సంబంధించి కొన్ని సంస్థల నుంచి బెదిరింపులు కూడా వచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్టు సమాచారం.

KTR Condemn Udaipur Murder 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News