Sunday, January 12, 2025

రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరువు

- Advertisement -
- Advertisement -

ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ
నెరవేర్చకపోవడం దారుణం
ఆశా వర్కర్లపై దాడి చేసిన ఎసిపి,
ఇన్‌స్పెక్టర్లను విధుల నుంచి
తొలగించాలి బిఆర్‌ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మన తెలంగాణ/గోషామహల్:తెలంగాణరా ష్ట్రం లో ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ ఆరోపించారు. తమ న్యాయమైన హక్కుల సాధనకై ప్ర జాస్వామ్య పద్ద్ధతిలో నిరసన వ్యక్తం చేసేందుకు సోమవారం కోఠిలోని కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన ఆశా వర్కర్లను మహిళలు అన్న కనీస గౌరవం కూడా లేకుండా పురుష పోలీసులు ఆశాల దుస్తులు లాగి, లాఠీలు ఘుళిపించిన దమనకాండ దుశాసన పర్వాన్ని తలపించిందని ఆరోపించారు. ఆశా వర్కర్లపై పోలీసుల భౌతికదాడిని బిఆర్‌ఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాజీ ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సహాయ్, ఆర్ ఎంవో డాక్టర్ మహ్మద్ రఫీలతో కలిసి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స లు పొందుతున్న ఆశా వర్కర్ రహీంబీని పరామర్శించి, తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రహీంబీకి ఇక్కడ చికిత్సలు నచ్చకపోతే బిఆర్‌ఎస్ పార్టీ నేతృత్వంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సలు చేయిస్తామని కెటిఆర్ హామీనిచ్చారు.

అనంతరం ఓపీ భవనం ఆవరణలో మాజీ మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి, ప్రజలకు సేవలందించిన ఆశా వర్కర్లను తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోగా ఆశా వర్కర్ల వేతనం రూ. 18వేలకు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీనిచ్చి, ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం దుర్మార్గమన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో ఆశాలకు జీతాలు పెంచామని ఆయన గుర్తుచేశారు. సోనియాగాంధీ జన్మదినోత్సవమని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి యేడాది కాలం పూర్తి చేసుకున్న సందర్బంగా విజయోత్సవాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ న్యాయమైన హక్కుల సాధనకై ప్రజాస్వామ్య పద్ద్ధతిలో నిరసన వ్యక్తం చేసి, కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చి న ఆశాలపై పోలీసులు ఆడబిడ్డలన్న కనికరం కూడా లేకుండా పురుష పోలీసులు వారి రెక్కలు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి వస్తువులను పడే సినట్లు వ్యాన్‌లో పడేయడం దారుణమన్నారు. ఒక ఎసిపి అత్యంత దారుణంగా ఓ ఆడబిడ్డ చీర లాగడం దారుణమని, ఈ ఘటన జరిగి 24 గంటలు గడిచినా కనీసం విచారణకు సైతం సిఎం ఆదేశించకపోవడం, ఆశాలపై భౌతిక దాడికి పాల్పడిన పోలీసులపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దా రుణమన్నారు.

తమ వేతనాన్ని రూ.18వేలకు పెంచుతామని ఇచ్చిన హామీని గుర్తు చేసేందుకు వచ్చిన ఆశాలపై పోలీసులు భౌతిక దాడికి పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆశాలపై భౌతిక దాడి చేసిన ఎసిపి, ఇన్‌స్పెక్టర్‌లను వెంటనే విధుల నుండి తొలగించాలని బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ విషయమై రాష్ట్ర, జాతీయ మహిళా మానవ హక్కుల కమిషన్‌కు వెళ్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గల ఆశాలకు రూ.18వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేవారు. ఈ నెల 16న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలపై పోలీసుల దాష్టీకం, అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు దేవీప్రసాద్, గడ్డ్డం శ్రీనివాస్ యాదవ్, ఆర్వీ మహేందర్ కుమార్, ఆశిష్‌కుమార్ యాదవ్, ప్రియాగుప్తా, ఎం శ్రీనివాస్ గౌడ్, మేకల విష్ణు, ప్రదీప్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఉస్మానియాలో ఆశాల నిరసన
వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆశాలు ఉస్మానియా ఆసుపత్రి ఓపీ భవనం గేటు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు.
కెటిఆర్ రాకతో భారీ బందోబస్తు
చికిత్సలు పొందుతున్న ఆశాను పరామర్శించేందుకు మాజీ మంత్రి కెటిఆర్ రాక సందర్బంగా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గంట ముందు నుంచే ఓపీ భవనంలో గేట్లను మూసేయడంతో వార్డుల్లోకి వెళ్లాల్సిన రోగులు, వారి సహాయకులు సుమారు గంటన్నర పాటు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్సల నిమిత్తం వచ్చిన ఓ చిన్నారి బాలుడితో మాజీ మంత్రి కెటిఆర్ స్వయంగా సెల్ఫీ దిగారు. ఇదిలా ఉండగా ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది పోటీలు పడి మరీ కెటిఆర్‌తో సెల్ఫీలు దిగి తమ స్టేటస్‌లో పెట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News