Sunday, February 23, 2025

ఉద్యమ నేతకు కడసారి వీడ్కోలు పలికిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ములుగు: తెలంగాణ ఉద్యమ నేత, ములుగు జెడ్ పి చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ అంత్యక్రియలకు మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, రాజ్యసభ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రులు, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు హాజరై భారత రాష్ట్ర సమితి జెండాను జగదీష్ పార్థీవదేహముపై కప్పి ఘన నివాళులర్పించారు.

వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులతో మంత్రి కెటిఆర్, ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం అని భరోసా కల్పించారు. ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News