Monday, December 23, 2024

శివరాత్రి లోగా సుందరంగా వేముల వాడను తీర్చిదిద్దాలి : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ఆధ్యాత్మికత ఉట్టి పడేలా వేములవాడ పట్టణ్ణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని మంత్రి తారక రామారావు అన్నారు. పట్టణ ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ఆధ్యాత్మికత, సుందరీకరణ ఉట్టిపడేలా పూర్తిచేసి వేములవాడ ముఖచిత్రం మారేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు .మంగళవారం వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు, మిషన్ భగీరథ ఇంజనీర్లు, ప్రజారోగ్య విభాగం ఇంజనీర్లు, VTDA అధికారులతో మంత్రి , స్థానిక శాసన సభ్యులు చెన్నమనేని రమేష్ బాబు తో కలిసి వేములవాడ MLA క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

వేములవాడ పట్టణంలో ములావాగు బండ్ సుందరీకరణ, లైటింగ్ పనులు, వాల్ ఆర్ట్ పనులు మిషన్ మోడ్ లో పూర్తి చేయాలన్నారు.ప్రగతిలో ఉన్న జంక్షన్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.వేములవాడ పట్టణం కు వచ్చే అప్రోచ్ రోడ్లతో పాటు ప్రధాన రోడ్లు హరిత శోభలను సంతరించుకోవాలని జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. పురోగతిలో ఉన్న అన్ని పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు.వేములవాడ పట్టణంలో ఉన్న ప్రధాన రోడ్ల ప్యాచ్ వర్క్ పనులను, మురుగునీటి కాలువల మరమ్మత్తుల పనులను పూర్తి చేయాలని ఆర్ అండ్ బి ఇంజనీర్ల కు మంత్రి సూచించారు.శివరాత్రి పర్వదినంను వైభవోపేతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

పట్టణంలో ఇంకేమైనా అభివృద్ధి ప్రణాళికలుంటే వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి తారకరామారావు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈసమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, మున్సిపల్ అధికారులు, ఇంజనీర్ లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News