మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సిఏ) డైరెక్టర్‌గా హైదరాబాదీ వివిఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టారు. బెంగళూరులోని ఎన్‌సిఎ ప్రధాన కార్యాలయంలో లక్ష్మణ్ విధుల్లో చేరాడు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌కు తెలంగాణ మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. ‘కొత్త బాధ్యతలు చేపట్టి సోదరుడు లక్ష్మణ్‌కు అభినందనలు. జెంటిల్‌మెన్ అయిన నీతో పాటు.. రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో భారత క్రికెట్ మరింత గొప్పగా, అద్భుతంగా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందనే నమ్మకం నాకుంది’ అని కెటిఆర్ ట్వీట్ చేశారు.
ఇంతకు ముందు ఎన్‌సిఏ డైరెక్టర్‌గా ద్రవిడ్ ఉన్నారు. టీమిండియా కోచ్‌గా ద్రవిడ్ నియామకంతో ఎన్‌సిఎ పదవి ఖాళీ అయింది. దీంతో లక్ష్మణ్‌కు ఈ బాధ్యతలు అప్పగించాలని బిసిసిఐ నిర్ణయించింది. ఇంతకుముందు గత కొన్ని సీజన్‌లుగా ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్‌గా, బెంగాల్ క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ సలహాదారుగా లక్ష్మణ్ పనిచేశాడు. అయితే ఎన్‌సిఎ బాధ్యతలు చేపట్టాల్సి ఉండటంతో వీటి నుంచి వివిఎస్ తప్పుకున్నాడు.