Sunday, December 22, 2024

KTR: సర్పంచ్‌ను అభినందించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రాజంపేట ః కామారెడ్డి జిల్లాలోని రాజంపేట గ్రామ పంచాయితీ 2021-22 సంవత్సరానికి గాను జాతీయ పంచాయితీ అవార్డు అందుకున్న సందర్బంగా శుక్రవారం హైదరాబాద్‌లోని జాతీయ పంచాయితీ అవార్డుల ప్రధానోత్సవంలో దిన్‌దయాల్ ఉపాద్యాయ పంచాయితీ మిషన్ వికాస్ పురస్కర్ కార్యక్రమంలో రాజంపేట గ్రామ సర్పంచ్ సౌమ్య నాగరాజును రాష్ట్ర ఐటి శాఖ మంత్రి తారక రామారావు. అభినందించారు.

గ్రామంలో పల్లే పకృతి వనంతో పాటు స్మశాన వాటికలు, డంపింగ్‌యార్డ్‌లు, మేగాపార్క్, క్రీడా ప్రాంగణం, పంచాయితీ ట్రాక్టర్‌లు, ట్యాంకర్‌లుతో పాటు పారిశుద్య కార్యక్రమాల మొక్కల పెంపకం, నర్సరీల సంరక్షణ అమలు చేయడంలో ముందజలో ఉన్నందున ఈ పంచాయితీ కార్యక్రమాలు సైతం ముందజలో నడిపించినందుకు గాను మంత్రి ఆమెను అభినందించారు. అలాగే ఉత్తమ పంచాయితీ అవార్డు సాదించిన పంచాయితీలకు 10 లక్షల రూపాయలు అందించనున్నట్లు మంత్రి వివరించారు.

ఈ సందర్బంగా మంత్రి ని సర్పంచ్ మర్యాద పూర్వకంగా కలసి మండల కేంద్రంలోని సమస్యలు మంత్రులకు వివరించినట్లు సర్పంచ్ తెలిపారు. వినతిని విన్న మంత్రి త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరించుకునేల కృషి చేస్తానని హామి ఇచ్చారని ఆమె తెలిపారు. పంచాయితీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయకర్ రావు, కార్మిక శాక మంత్రి మల్లారెడ్డి లను కలిసారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News