Monday, December 23, 2024

కెటిఆర్ గొప్ప మనసు.. నానమ్మ జ్ఞాపకార్థంగా సొంత ఖర్చుతో కోనాపూర్‌లో స్కూల్ భవనం నిర్మాణం

- Advertisement -
- Advertisement -

Minister KTR slams centre over india development

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి తన మంచి మనసుని చాటుకుంటూ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన నానమ్మ వెంకటమ్మ పుట్టిన ఊరిలో ఆమె జ్ఞాపకార్థంగా స్కూల్ భవనాన్ని సొంత ఖర్చుతో నిర్మిస్త్న్నుట్లు కెటిఆర్ ట్వీట్ చేశారు. నా గ్రామం -నా పాఠశాల కార్యక్రమం కింద తన సొంత ఖర్చుతో పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. నానమ్మను స్మరించుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం గురించి ఆలోచించడం లేదని కెటిఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లాలోని కోనాపూర్‌లో స్కూల్ భవనానికి మంగళవారం శంకుస్థాపన చేస్తున్నందుకు ఆనందంగా ఉందని కెటిఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. బేబీపేట మండలం కోనాపూర్ గ్రామానికి చేరుకున్న ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపి బీబీపాటిల్, జిల్లా కలెక్టర్ జీవీ పాటిల్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి కెటిఆర్ నివాళులర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News